ప్రతి ఫిబ్రవరి 29 మాత్రమే ఈ పేపర్ వస్తుంది.. ధరెంతో తెలిస్తే షాక్

పేపర్.. పత్రిక అంటే సహజంగా 10 రూపాయలకు మించి ఉండదు.. అది కూడా రోజూ వస్తుంది.. అదే మ్యాగజైన్ అయితే వారానికో.. 15 రోజులకో.. నెలకో ఒకసారి వస్తుంది.. దాని ధర కూడా వంద రూపాయలకు మించదు.. ఈ పత్రిక మాత్రం నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది.. అది కూడా ఫిబ్రవరి 29వ తేదీ.. అంటే లీప్ ఇయర్ లో.. ఒక్కసారి మాత్రమే వస్తుంది.. దీని ధర ఎంతో తెలుసా అక్షరాల 440 రూపాయలు. 

ప్రపంచంలో ఇలాంటి పేపర్ ఒక్కటి మాత్రమే ఉంది.. అదే la bougie du sapeur ( లా బౌగీ డు సపర్).. ఫ్రాన్స్ దేశంలోని ఓ పబ్లిషర్ దీన్ని ప్రచురిస్తారు. ఇంతకీ నాలుగేళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ పేపర్ లో ఏముంటాయి అనే ఆసక్తి అందరిలో ఉంటుంది. అదేంటో కూడా తెలుసుకుందాం.  20 పేజీలుండే ఈ పేపర్ లో  జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, క్రీడలు, సినిమాలపై  సెటైరికల్ కథనాలతో పాటుగా ఫన్నీ జోక్స్‌, క్రాస్ వర్డ్స్ ఉంటాయి.  

అయితే వాటి సమాధానాల కోసం తరువాలి ఎడిషన్ అంటే మళ్లీ నాలుగేళ్లకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది.   1980లో ప్రారంభమైన ఈ వార్తాపత్రికకు ఇప్పటి వరకు 12 ఎడిషన్లు మాత్రమే ప్రచురించింది.  నాలుగేళ్లకు ఒకసారి వెలువడే ఈ వార్తాపత్రిక కోసం లక్షలాది మంది వెయిట్ చూస్తుంటారు.  

ALSO READ :- IAS కి రాజీనామా చేసి వైసీపీలో చేరిన ఇంతియాజ్..!

హాస్యంతో కూడిన తొలి ఎడిషన్‌కు మంచి ఆదరణ లభించింది. ఏకంగా 30,000 కాపీలు అమ్ముడయ్యాయి.  ఫ్రాన్స్‌కు చెందిన తొలితరం కార్టూనిస్ట్‌ లీ సప్పర్‌ కామెంబెర్ట్‌ గుర్తుగా ఈ పత్రికకు పేరు పెట్టారు. ఇది ఆన్‌లైన్‌లో అందుబాటులో లేదు. న్యూస్‌ ఏజెంట్లు, దుకాణాల నుంచే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. చివరిసారిగా 2020లో ఈ పేపర్ విడుదలైంది.