ఈ 6 పాటించి స్టాక్ మార్కెట్లో.. ఇలా తెలివిగా డబ్బులు పెడితే.. నష్టాలు రావంటున్న నిపుణులు

ఈ 6 పాటించి స్టాక్ మార్కెట్లో.. ఇలా తెలివిగా డబ్బులు పెడితే.. నష్టాలు రావంటున్న నిపుణులు

ప్రస్తుతం పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల పోర్ట్​ఫోలియోలు కూడా భారీ నష్టాల్లోనే ట్రేడ్​ అవుతున్నాయి. సహజంగానే మన పోర్ట్​ఫోలియోలు కూడా నష్టాల్లోనే ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. మిడ్​ క్యాప్​, స్మాల్​క్యాప్​ స్టాక్స్ తీసుకున్నవారిలో భారీగా లాస్​ కనిపిస్తుండొచ్చని, అయితే.. దీనికి భయపడొద్దని సూచిస్తున్నారు.

Also Read :- హైదరాబాద్లో తులం మరీ ఇంత రేటా..!

  1. స్టాక్స్​ కొనేటప్పుడే లాంగ్​టర్మ్​ హోల్డ్​ చేస్తామన్న ఆలోచనతోనే దిగాలి.  స్టాక్స్​కు సంబంధించిన కంపెనీల పూర్వాపరాలు పరిశీలించి, లాభనష్టాలు అంచనా వేసుకొని, చార్ట్​లు విశ్లేషించుకొని పెట్టుబడులు పెట్టాలి.

  2. ప్రస్తుతం నష్టాల్లో పోర్ట్​ఫోలియోలు ట్రేడ్​ అవుతున్నందున ముందుగా మన ఎమోషన్స్ను కంట్రోల్​ చేసుకోవాలి.

  3. పడుతున్నప్పుడు పదే పదే స్టాక్స్​ను యాడ్ చేయొద్దు.. అందుకోసం బయట నుంచి అప్పులు తేవొద్దు.

  4. మనం కొన్న స్టాక్​ సపోర్ట్​ లెవల్​, రెసిస్టెంట్​ లెవల్ను జాగ్రత్తగా గుర్తించి ఆ ఏరియాలోనే యాడ్​ చేసుకుంటూ పోవాలి.

  5. మైనస్​లో పోర్ట్​ఫోలియో ట్రేడ్​ అవుతుందని చెప్పి వాటి నుంచి వెంటనే ఎగ్జిట్​ కావొద్దు.

  6. స్టాక్​ మార్కెట్లలో ఒడిదొడుకులు సహజమని, ఇప్పుడు పడుతున్న స్టాక్స్​ కొన్నాళ్లకు లేస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఓపిక అవసరమని, తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని సూచిస్తున్నారు.