
దుబ్బాక, వెలుగు: నియోజకవర్గంలోని డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి వాహనదారుడికి ప్రమాద బీమా చేయిస్తానని ఎమ్మెల్యే రఘునందన్‌రావు హామీ ఇచ్చారు. బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వాహనదారులకు లెర్నింగ్ లైసెన్స్ పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లెర్నింగ్ లైసెన్స్ ఆరు నెలల పాటు కాల పరిమితి ఉంటుందని, డ్రైవింగ్ లైసెన్స్ దశలవారీగా అందజేస్తామని చెప్పారు.
లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రూ. 2 లక్షల ప్రమాద బీమా చేయిస్తానని చెప్పారు.అనంతరం బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంబటి బాలేశ్‌గౌడ్, ఎస్‌ఎన్‌చారి, కె. శుభాష్‌రెడ్డి, భిక్షపతి, మంద అనిల్ రెడ్డి, గాజుల భాస్కర్, అమర్, మధు సూదన్ రెడ్డి, తొగుట రవి, సప్తగిరి, నేహాల్ గౌడ్ పాల్గొన్నారు.