
పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాకిస్తాన్కు భారత్ షాక్ఇచ్చింది. భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. 48గంటల్లో పాక్ పర్యాటకులు.. ఇండియాలో ఉంటున్న పాక్ పౌరులు ఇండియాను వదలి వెళ్లాలని పాక్ హైకమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ దేశీయులను భారత్లోకి అనుమతించమని తేల్చి చెప్పింది భారత ప్రభుత్వం. ఇండియా... పాకిస్తాన్ మధ్య సింధు జలాల మధ్య ఒప్పందాన్ని నిలిపివేసింది. పహల్గామ్ దాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అటారీ వాఘా సరిహద్దు చెక్ పోస్ట్ ను మూసివేశారు.
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్‌లో సాధారణ టూరిస్టులను టార్గెట్ చేసుకుని ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు తామే పాల్పడినట్లుగా పాక్ ప్రేరేపిత లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్)’’ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఈ దాడికి సంబంధించి పాకిస్తాన్ ప్రమేయాన్ని భారత ఇంటెలిజెన్స్ సంస్థలు కనుగొన్నాయి.