స్వచ్ఛందంగా వెళ్లిపోండి.. క్యాంపస్ నిరసనల్లో పాల్గొన్న స్టూడెంట్లకు అమెరికా హెచ్చరిక

స్వచ్ఛందంగా వెళ్లిపోండి.. క్యాంపస్ నిరసనల్లో పాల్గొన్న స్టూడెంట్లకు అమెరికా హెచ్చరిక

వాషింగ్టన్: క్యాంపస్ నిరసనల్లో పాల్గొన్న విదేశీ స్టూడెంట్ల వీసాలను అమెరికా రద్దు చేసింది. స్వచ్ఛందంగా తమ దేశం విడిచి వెళ్లిపోవాలని వాళ్లందరికీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు వందలాది మంది స్టూడెంట్లకు ఈ–మెయిల్స్ పంపింది. కేవలం క్యాంపస్ నిరసనల్లో పాల్గొన్న స్టూడెంట్లకే కాకుండా.. సోషల్ మీడియాలో యాంటీ నేషనల్ పోస్టులు పెట్టినోళ్లకు, ఆ పోస్టులను లైక్ చేసినోళ్లకూ మెయిల్స్ పంపించింది. వీరిలో కొంతమంది ఇండియన్ స్టూడెంట్లు కూడా ఉన్నారు. కాగా, 2023–24 నాటికి అమెరికాలో 11 లక్షల మంది విదేశీ స్టూడెంట్లు ఉండగా.. వారిలో 
3.31 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు.

ఈ–మెయిల్‌‌‌‌‌‌‌‌లో ఏముంది? 

వీసా రద్దయిన స్టూడెంట్లకు అమెరికా విదేశాంగ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ కాన్సులేట్ అఫైర్స్ విభాగం నుంచి మెయిల్ వచ్చింది. స్టూడెంట్లు స్వచ్ఛందంగా అమెరికా విడిచి వెళ్లిపోవాలని, అందుకోసం సీబీపీ హోమ్ యాప్‌‌‌‌‌‌‌‌ను వినియోగించుకోవాలని అందులో సూచించింది. ‘‘ఇమిగ్రేషన్ చట్టంలోని సెక్షన్ 221(i) ప్రకారం మీ వీసా రద్దయింది. ఈ సమాచారం ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు అందించాం. వాళ్లు మీ కాలేజీకి సమాచారం అందించే అవకాశం ఉంది. వీసా లేకుండా అమెరికాలో ఉండడం నేరం. ఇది జరిమానాతో పాటు అరెస్టు, బహిష్కరణకు దారితీస్తుంది. 

అంతేకాకుండా భవిష్యత్తులో మళ్లీ మీరు అమెరికాకు వచ్చేందుకు అవకాశం లేకుండా పోతుంది. బహిష్కరణకు గురైన వ్యక్తులను వాళ్ల సొంత దేశానికి కాకుండా, వేరే దేశానికి పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోండి. రద్దయిన వీసాతో అమెరికాలో ఉండేందుకు ప్రయత్నించకండి. మీరు వెళ్లేటప్పుడు యూఎస్ ఎంబసీ/కాన్సులేట్‌‌‌‌‌‌‌‌లో మీ పాస్‌‌‌‌‌‌‌‌పోర్టును అప్పగిస్తే, ఫిజికల్‌‌‌‌‌‌‌‌గా వీసాను రద్దు చేస్తారు. మీరు మళ్లీ భవిష్యత్తులో అమెరికాకు రావాలనుకుంటే, కొత్త వీసాకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీ అర్హతలను బట్టి నిర్ణయం తీసుకుంటం” అని మెయిల్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది.