పర్యావరణ పరిరక్షణనే లక్ష్యంగా కూకట్ పల్లి జై భారత్ నగర్ లో వెరిటేక్స్ ప్రైడ్ లో మొక్కల తో ఏర్పాటు చేసిన హరిత వినాయకుడికి విశేష స్పందన లభించింది. స్థానికులు భారీగా క్యూ కట్టారని అపార్ట్మెంట్ వాసులు వెల్లడించారు. ప్రతి వినాయక చవితికి పర్యావరణాన్ని కాపాడడమే ఉద్దేశ్యంగా గత పది సంవత్సరాలుగా తాము మట్టి గణపతులను పూజిస్తున్నామని వారు తెలిపారు.
ALSO READ | అప్పుల బాధలు వేధిస్తున్నాయా... అయితే వినాయకుడిని ఇలా పూజించండి..
ఈఏడాది (2024) పండుగకు మూడు రోజుల వ్యవధిలోనే వివిధ రకాల మొక్కలతో హరిత వినాయకుడిని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వినాయకుడిని తయారు చేయడంలో సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలు కులమతాలకు అతీతంగా జరుపుకుంటామని అదే విధంగా ఈ నవరాత్రి వేడుకలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ రేపటి తరానికి అందజేయాలని కోరారు.