విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. లెక్చరర్ అరెస్ట్

విద్యార్థినులపై లైంగిక వేధింపులు.. లెక్చరర్ అరెస్ట్

విద్యార్థినులను లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న ఓ ఇంజినీరింగ్ కాలేజీ లెక్చరర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం శేరిగుడాలోని శ్రీ ఇందు ఇంజినీరింగ్ కళాశాలలో చోటుచేసుకుంది. క్లాస్ రూమ్ ల్లో విద్యార్థినుల చేతిలో నుంచి సెల్ ఫోన్లు లాక్కుని.. వారి ఫోన్ నెంబర్లు తీసుకుని.. రాత్రిపూట అసభ్యంగా మెసేజ్ లు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శేరిగూడ శ్రీ ఇందు కళాశాలలో బీ-టెక్ మెదటి సంవత్సరం చదువుతున్న 19ఏళ్ల విద్యార్థినిని..  లెక్చరర్ శోభన్ బాబు అర్ధరాత్రి వరకు అసభ్యకరమైన మెసేజస్ పంపుతూ వేధిస్తున్నాడు. లెక్చరర్ టార్చర్ తట్టుకోలేక తల్లిదండ్రులకు తెలపడంతో.. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో విద్యార్థిని తల్లి ఫిర్యాదు చేసింది. అయితే.. విషయం బయటకు పొక్కకుండా..  శ్రీఇందు కాలేజీ యాజమాన్యం, భాదితుల నోరునొక్కే ప్రయత్నం చేసింది. నిందితుడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం లెక్చరర్ శోభన్ బాబును అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. 

నిందితుడు ముగ్గురు విద్యార్థులను వేధించినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు.  ఇంజినీరింగ్ విద్యార్థులకు కళాశాలలోనే అధ్యాపకులు వేధింపులకు గురిచేయడంపై విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని.. కళాశాల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.