బుజ్జాయికి లాలి పాడాడు ఓ లెక్చరర్.. లాలి ముద్దుల బాల.. అంటూ తన స్టుడెంట్ పాపకు జోల పాడి నిద్రపుచ్చిండు. మొదట్లో ఏడ్చిన పాప...లెక్చరర్ పాట నచ్చి హాయిగా నిద్రపోయింది.
సాధారణంగా విద్యార్థులు ట్రైనింగ్ కోసం వస్తే.. గురువులు తమ స్టూడెంట్స్ కు సీరియస్ గా పాఠాలు చెబుతుంటారు. కానీ కరీంనగర్ లోని ఓ ట్రైనింగ్ సెంటర్ కు ట్రైనింగ్ కోసం వచ్చిన విద్యార్థి పాపని ఎత్తుకొని.. పాట పాడి నిద్రపుచ్చాడులెక్చరర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.
వరంగల్ కి చెందిన సీనియర్ సంగీత గురువు ఉమ్మాడి లక్ష్మణాచారి తన విధుల నిమిత్తం.. కరీంనగర్ లో టీచర్ ట్రైనింగ్ కోర్స్ కి సంబంధించిన అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. అయితే అందులో ఓ స్టూడెంట్ తన మూడు నెలల పాపతో క్లాసులకు హాజరవుతోంది. అయితే ఆ చిన్నారి క్లాసులో చేస్తున్న అల్లరి చూసిన సదరు లెక్చరర్.. తన జోల పాటతో నిద్ర పుచ్చే ప్రయత్నం చేశాడు.
పాపకు లెక్చరర్ జోలపాడే వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..పలువురు నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. ఎంతైనా కళాకారులకు సున్నిత మనస్సు కాస్త ఎక్కువే అనడానికి ఈ వీడియోనే నిదర్శనమని పలువురు కామెంట్లు చేస్తున్నారు.