- 1,139 మంది జూనియర్ లెక్చరర్లకు త్వరలో నియామక పత్రాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు జూనియర్ కాలేజీలకు కొత్త లెక్చరర్లు రానున్నారు. ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులకు త్వరలోనే పర్మినెంట్ లెక్చరర్లను నియమించనున్నారు. 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి రెండేండ్ల కింద టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ పోస్టులకు సెలెక్టె అయిన అభ్యర్థుల జాబితాను ఇంటర్ కమిషనరేట్‌కు టీజీపీఎస్సీ అందించింది.
దీంట్లో మల్టీజోన్ 1లో 581 మంది ఉండగా, మల్టీజోన్ 2లో 558 మంది ఉన్నారు. ప్రధానంగా అరబిక్‌లో 2, బాటనీలో 112, కెమిస్ర్టీలో 123, సివిక్స్ లో 66, కామర్స్ లో53, ఎకనామిక్స్ లో 87, ఫ్రెంచ్ లో 2, హిందీలో 116, హిస్టరీలో 83, మ్యాథ్స్ లో156, ఫిజిక్స్ లో120, సంస్కృతంలో 9, తెలుగులో 55, ఉర్దూలో 21, జువాలజీలో 134 పోస్టులు ఉన్నాయి. వీరందరికీ వారంలోనే నియామక పత్రాలు అందించేందుకు ఇంటర్మీడియేట్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది.