అక్టోబర్8న బీఎల్ఎఫ్ ఫస్ట్ లిస్ట్

చైర్మన్ సూర్యప్రకాశ్, కన్వీనర్ వెంకట్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ఈ నెల 8న రిలీజ్ చేస్తామని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) చైర్మన్ నల్లా సూర్య ప్రకాశ్, రాష్ట్ర కన్వీనర్ దండి వెంకట్ వెల్లడించారు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. గురువారం హైదరాబాద్​లోని ఓంకార్ భవన్​లో బీఎల్ఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. 

ALSO READ :  నాలుగు జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అత్యధికంగా

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాష్ట్రంలో బహుజన రాజ్యాధికార సాధన కోసం సాగే ఉద్యమంలో ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోవాలన్నారు. బీఎల్ఎఫ్ అభ్యర్థులకు మద్దతివ్వాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో బీఎల్ఎఫ్ భాగస్వామ్య పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు వనం సుధాకర్, పర్వతాలు, నూనె వెంకటస్వామి, సిద్దిరాములు పాల్గొన్నారు.