పందెంకోడిని బస్టాండులో వదిలేసి వెళ్లాడు

కరీంనగర్  సిటీ, వెలుగు : ప్రయాణికుడు వదిలేసి వెళ్లిన పందెంకోడిని కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్  ఆవరణలోని ఆర్టీసీ 2 డిపో ముందు అధికారులు తాడుతో కట్టి సంరక్షిస్తున్నారు. మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి ఆర్టీసీ బస్సులో ఒక బుట్టలో ఆరు కిలోల పందెం కోడిని తెచ్చాడు. బస్టాండ్  ఆవరణలో ఆ కోడిని వదిలి వెళ్లాడు. ఆర్టీసీ అధికారులు ఆ కోడిని స్వాధీనం చేసుకొని ఆర్టీసీ-2 డిపో ముందు కట్టివేశారు.

పందెంకోడి కావడంతో బస్టాండ్ లో పోలీసులను చూసి భయపడి ఆ వ్యక్తి  దానిని వదిలేసి ఉండవచ్చని ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. అయితే, బస్సులో ఎవరైనా ప్రయాణికులు తమ వస్తువులు మర్చిపోతే అధికారులు వాటిని భద్రపరిచి తిరిగి సంబంధిత ప్రయాణికులకు ఇస్తుంటారు. అదేవిధంగా కోడిని కూడా భద్రంగా ఉంచారు. కాగా, పందెం కోడి కోసం ఎవరూ రాకపోతుండడంతో రోజూ దాణా, నీరు పెట్టడం అధికారులకు తలనొప్పిగా మారింది.