కూటమికి పట్టని ‘లెఫ్ట్‘

ఇప్పటివరకు ఇండియాలో ఎన్నిక ఏదైనా లెఫ్ట్‌ పార్టీలు లేకుండా పాలిటిక్స్‌ నడిచిన దాఖలాలు లేవు. ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారనే విషయంతో సంబంధం లేకుండా వామపక్షాలు తమ ఓటు బ్యాంక్‌‌‌‌తో పొత్తులు కుదుర్చుకునేవి. అలాంటిది, ప్రస్తుత ఎన్నికల వాతావరణంలో లెఫ్ట్‌ పార్టీల ఉనికి కనబడడం లేదు. ఒకవైపున లోక్‌‌‌‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ , సమాజ్‌ వాది, బహుజన సమాజ్‌ పార్టీ వంటివి పొత్తుల రాజకీయాలు నడిపేశాయి.

ఎన్డీయే కూటమి మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాల్ లో మిత్రపక్షాలతో సీట్ల పంపకం కుదుర్చుకుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహా ఘట్‌ బంధన్‌ ( కూటమి) కూడా భావ సారూప్యత గల పార్టీలతో ఒక రూపానికొచ్చింది. ఇవన్నీ ఇలా ఉంటే, బీహార్‌ లో సీపీఎం (ఎంఎల్) లిబరేషన్‌ కి ముగ్గు రు ఎమ్మెల్యేలు ఉన్నారు . రాంవిలాస్ పాశ్వాన్ నాయకత్వంలోని లోక్ జనశక్తి పార్టీ (ఎల్జెపీ)కంటే సీపీఎం (ఎంఎల్) పెద్ద పార్టీ. ఎల్జేపీకి కేవలం ఇద్దరే ఎమ్మెల్యేలు ఉన్నారు . 2015 అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐకి 5,16,000 ఓట్లు వచ్చాయి. మరో లెఫ్ట్ పార్టీ సీపీఐ (ఎంఎల్)కి 5,87,000 ఓట్లు వచ్చాయి. రెండు లెఫ్ట్ పార్టీలు ఉమ్మడిగా దాదాపు మూడు శాతం ఓట్ షేర్ తెచ్చుకున్నా యి. అయితే రాష్ట్రంలోని కొన్నిప్రాంతాలకే ఇవి పరిమితమయ్యాయి. బెగుసరాయ్, మిథిల ప్రాంతాల్లో సీపీఐకి మంచి పట్టుంది. ఆర,  సివాన్, కతిహార్ సెగ్మెం ట్ల పరిధిలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ చెప్పుకోదగ్గ స్థా యిలో ఉంది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఓటు షేర్ ఏడు శాతం దాటుతుందన్నది అంచనా. బీహార్‌ లోని మొత్తం 40 ఎంపీ సీట్లలో బీజేపీ, జెడీ(యు) చెరి 17 సీట్లకు, లోక్‌‌‌‌ జనశక్తి పార్టీకి ఆరు సీట్లకు ఒప్పం దం కుదిరిం ది. ఇక, కూటమిలో లాలూ ప్రసాద్‌ పార్టీ ఆర్‌జేడీకి పెద్దవాటా దక్కింది. ఆర్‌ జేడీ20 సీట్లలో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ తొమ్మిదితో సరి పెట్టుకుం ది. ఉపేంద్ర కుష్వాకి చెం దిన ఆర్‌ ఎల్‌‌‌‌ఎస్‌ పీ4, జితిన్‌ రామ్‌ మాం ఝీ పార్టీ హెచ్‌ ఏఎం 3, ఎల్‌‌‌‌జేడీ 2, విజేపీ ఒక సీటులో పోటీ చేస్తున్నా యి. మిగిలిన ఒక్క సీటునీ సిపీఎంకి చెం దిన కన్హయ్యకుమార్‌ కి ఇచ్చే ఉద్దేశంలో ఉన్నారు . బీజేపీ 12 సీట్లు గెలవడం సందేహమే! ఇక, జార్ఖండ్‌ విషయానికొస్తే… 81మంది సభ్యులున్న అసెంబ్లీ లో సీపీఐ (ఎంఎల్)కి ఒకే ఒక్క సభ్యుడున్నారు. మరో సెగ్మెం ట్‌ లో సీపీఐ (ఎంఎల్) కేం డిడేట్ రెండో ప్లేస్‌ లో నిలిచారు.

2014 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) రాష్ట్ర వ్యాప్తంగా 1.5 శాతం ఓట్ షేర్ తెచ్చుకుం ది. రాష్ట్రం లోని గిరిధ్, పలమూ ప్రాంతాల్లో లెఫ్ట్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.2014 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌ లో బీజేపీ 12 సీట్లు గెలుచుకుం ది. మిగిలిన రెండు సీట్లను జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) దక్కించుకుం ది. ఈసారి 12 సీట్లలో పాగా వేయడం అనుమానంగానే ఉంది. జార్ఖండ్‌ లోని రఘువర్ దాస్ (బీజేపీ) ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు సర్వే లు చెబుతున్నా యి. ఇక కూటమి విషయానికి వస్తే కాంగ్రెస్, జేఎంఎం, మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాం డీ నాయకత్వంలోని జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీఎం), రాష్ట్రీయ జనతా దళ్ సీట్ల పంపకాలపై ఓ ఒప్పందానికి వచ్చాయి. ఈ మేరకు కాంగ్రెస్ ఏడు ఎంపీ సీట్లలోనూ,

జేఎంఎం నాలుగు సీట్లలోనూ, ఆర్జేడీ ఒక సీటులోనూ పోటీ చేస్తాయి. సీపీఐ (ఎంఎల్) లిబరేషన్‌ కి ఈ అలయన్స్‌లో చోటే దొరకలేదు. ఇక్కడ కేం డిడేట్ల తలరాతలను మార్చే స్థా యిలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్​ ఉంది. మరీ ముఖ్యం గా కొడెర్మ లోక్‌‌‌‌సభ సెగ్మెం ట్‌ లో సీపీఐ (ఎంఎల్)కి పట్టు ఎక్కువ. 2009 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో ఈ సీటుని మరాం డీ (జేవీఎం) గెలవగా, 2014లోఆర్‌ కే రాయ్‌‌‌‌ (బీజేపీ) నెగ్గారు . ఇక్కడ 2014లో రెండున్నర లక్షల ఓట్లకు మిం చి సీపీఐ(ఎంఎల్‌‌‌‌) లిబరేషన్‌ అభ్యర్థి రాజ్‌ కుమార్‌ యాదవ్‌ సాధిం చి సెకండ్‌ ప్లేస్‌ లో నిలిచింది. అయినప్పటికీ కూటమి నాయకులు ఆ పార్టీని చాలా లైట్‌ గా తీసుకున్నారు . దీని ప్రభావం కొడెర్మ సెగ్మెం ట్‌ లో కూటమి గెలుపోటములపై తప్పకుం డా పడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాజ్ కుమార్ యాదవ్ అదే ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడెర్మ సెగ్మంట్‌ లోని ధన్వర్ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. అలాగే కొడెర్మ పరిధిలోని బగోదర్ అసెంబ్లీ సెగ్మెం ట్‌ లోనూ సీపీఐ (ఎంఎల్) లిబరేషన్‌ ప్రభావం ఎక్కువ. నాలుగు టర్మ్‌‌‌‌లుగా ఈ సీటుని లిబరేషన్ పార్టీయే దక్కించుకుంటోంది. 2014లో మాత్రం నాగేంద్ర మహతో (బీజేపీ) కైవసం చేసుకున్నారు . ఏమైనా కొడెర్మ లోక్‌‌‌‌సభ సెగ్మెం ట్‌ లో స్ట్రాం గ్ ఓటు బ్యాంక్ ఉన్న సీపీఐ (ఎంఎల్)ను అలయన్స్‌లో కోకపోవడం కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమికి మైనస్ పాయింటే అవుతుందంటున్నారు విశ్లేషకులు.

బీహార్‌ లోనూ ఇంతేనా! బీహార్‌ లోనూ కూటమి ఇదే పొరపాటు చేసిం దంటున్నారు పొలిటికల్‌‌‌‌ పండిట్లు. లెఫ్ట్ పార్టీలను అలయెన్స్‌ కి దూరంగా పెట్టేశారు. బెగుసరాయ్ లోక్‌‌‌‌సభసెగ్మెం ట్‌ లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్ లో సీపీఐకి మంచి పట్టుం ది. 2014 లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో బెగుసరాయ్ లోక్‌‌‌‌సభ సీటుని బీజేపీ గెలుచుకుంది. అయితే, 1,92,639 ఓట్లు తెచ్చుకుని సీపీఐ (రాజేంద్రసిం గ్) ఇక్కడ థర్డ్ ప్లేస్‌ లో నిలిచిం ది. ఈసారి ఎన్నికల్లో సీపీఐ తరఫున కన్హయ్య కుమార్ బరిలో నిలిచారు . పార్టీ పరంగా వచ్చే ఓట్లతో పాటు కన్హయ్య కుమార్‌ కి ఉన్న పాప్యులారిటీ కూడా సీపీఐ విజయావకాశాలను పెంచుతుం దని భావిస్తున్నారు . మొత్తం మీద బీహార్‌ లో కూటమికి సంబంధించి ఒక నియోజకవర్గం లో (బెగుసరాయ్) గెలుపు అవకాశాలను సీపీఐ దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే మరో రెండు లోక్ సభ సెగ్మెం ట్లలో (ఆరా, సివన్ ) కూటమి విజయావకాశాలను సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ దెబ్బతీస్తుం దని అంచనా. తాజా పరిణామాల్లో కూటమి ఒక్క సీటుని కన్హయ్యకుమార్‌ కి వదులుకోవచ్చని భావిస్తున్నారు .మొత్తంగా చూసినప్పుడు ఈ ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలకు ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీలన్నీ టచ్‌ మి నాట్‌ గానే ఉండడం గమనార్హం .