సిగ్గులేని సీఎం కేసీఆర్

కేసీఆర్​ అవినీతిపై న్యాయ పోరాటం

టీఆర్ఎస్​ సర్కారు ఉండేది మరో మూడేండ్లే

సీఎం అక్రమాలను జనం ముందు నిరూపిస్తం

మాఫియా సీఎంలుగా మారిన కేసీఆర్, జగన్

నీళ్ల పేరుతో వారిద్దరూ నిధులు మాయం చేస్తున్నరు

ఈ ప్రభుత్వంపై రైతులు తిరగబడుతున్నరు

బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఫైర్

బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం

రాజన్న సిరిసిల్ల, వెలుగు: టీఆర్ఎస్​ ప్రభుత్వం మరో మూడేండ్లు మాత్రమే అధికారంలో ఉంటుందని, మూడేండ్లలోపే సీఎం కేసీఆర్​ అక్రమాలు, అవినీతి కేసుల్లో జైలుకెళ్లడం వంద శాతం గ్యారంటీ అని కరీంనగర్​ ఎంపీ, బీజేపీ స్టేట్​ ప్రెసిడెంట్​ బండి సంజయ్​ అన్నారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉందని ఇలా చెప్పడం లేదని, కేసీఆర్ అవినీతిపై న్యాయ పోరాటం చేసి జనం ముందు నిరూపించాకే ఆయనను జైలుకు పంపిస్తామన్నారు. ఏపీ సీఎం జగన్​తో కేసీఆర్​ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని నీళ్ల పేరిట నిధులు మాయం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు కంపెనీలకే టెండర్లు అప్పగిస్తూ కోట్లు గడిస్తున్న కేసీఆర్, జగన్.. మాఫియా సీఎంలుగా పేరు తెచ్చుకుంటున్నారని సంజయ్​ ఫైరయ్యారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఉమ్మడి కరీంనగర్​ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం బీజేపీలో చేరారు. బండి సంజయ్​ కండువా కప్పి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. మృత్యుంజయంను మాజీ ఎంపీ, బీజేపీ కోర్​ కమిటీ సభ్యుడు వివేక్​ వెంకట స్వామి అభినందించారు. ఈ సందర్భంగా సంజయ్​ మీడియాతో మాట్లాడుతూ.. మృత్యుంజయం చేరికతో జిల్లాలో బీజేపీ మరింత బలపడుతుందన్నారు.

సిగ్గులేని సీఎం కేసీఆర్

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని, కానీ ఇప్పటి వరకూ ఎన్ని నీళ్లు, నిధులు ఇచ్చారని, ఎన్ని నియామాకాలు చేపట్టారని సంజయ్​ ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన కేసీఆర్.. ఆరేండ్లలో 20 వేల ఉద్యోగాలే భర్తీ చేశారని, కానీ తన ఫ్యామిలీలో పూర్తి స్థాయి నియామకాలు చేసుకున్నారని చెప్పారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షురాలు మమత భర్త ఉద్యోగ విరమణను ఎలా పొడిగించారో.. ఎందుకు ప్రత్యేక జీవో ఇచ్చారో ప్రకటించాని డిమాండ్​ చేశారు. కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు.. ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్నారని ఆరోపించారు. తన బంధువుల వైన్స్, పబ్​లు, బార్లకు ప్రత్యేక జీవోలిస్తున్న సిగ్గులేని సీఎం కేసీఆర్ అని సంజయ్​ విమర్శించారు.

ప్రభుత్వానిదే బాధ్యత అని రాసివ్వు

కరోనా కేసుల సంఖ్య పెరిగిందని తెలిస్తే.. తన ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుందనే భయంతో టెస్టులు మానేశారని సంజయ్​ ఆరోపించారు. మధుసూదన్​ అనే పేషెంట్​ మరణాన్ని ఇప్పటికీ ప్రభుత్వం ధ్రువీకరించడం లేదని, మనిషి చనిపోతే కూడా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. కొండపోచమ్మ, కాళేశ్వరం ప్రాజెక్ట్​లతో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలని సంజయ్​ డిమాండ్​ చేశారు. 21 మంది ఇంటర్​ స్టూడెంట్ల చావులకు కారణమైన గ్లోబరీనా సంస్థపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. ఈ సంస్థ వెనక మంత్రి కేటీఆర్​ హస్తం ఉందన్నారు. కేసీఆర్​ ఫాంహౌస్​లో ఉండి.. తాను ఏం పంట చెబితే ఆ పంటే రైతులు వేయాలని చెప్పడం సిగ్గుచేటన్నారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడుతున్నారన్నారు. రైతులకు ముందే మద్దతు ధర ప్రకటించి.. పంటనష్టం వస్తే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని కేసీఆర్​ రాసిస్తే రైతులు చెప్పిన పంట వేస్తారని చెప్పారు.

For More News..

భజనపరుల కోసమే సీఎం హామీలా?

అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఉంటేనే ఓపీ

ఈసారి బోనాల పండుగ లేనట్లే

50 ఏళ్లు దాటితే.. గండమే