సీఎస్ఐ భూములను కాపాడుకుంటాం : లీగల్ బోర్డ్ కన్వీనర్ అనిల్ కుమార్

సీఎస్ఐ భూములను కాపాడుకుంటాం : లీగల్ బోర్డ్ కన్వీనర్ అనిల్ కుమార్

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ సీఎస్ఐ చర్చి భూములను కాపాడుకుంటామని, అనుమతి లేకుండా చేసిన విక్రయాలు, లీజులు చెల్లవని సీఎస్ఐటీఏ ఉపాధ్యక్షుడు గుండ్ర కృపానందం, లీగల్ బోర్డ్ కన్వీనర్ అనిల్ కుమార్ పేర్కొన్నారు.  బుధవారం ఆర్మూర్ లో విలేకరులతో వారు మాట్లాడుతూ డిచ్ పల్లిలో క్రిస్టియన్ మిషనరీ ఆధ్వర్యంలో గతంలో ఆసుపత్రిని, అనుబంధంగా విక్టోరియా మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించారన్నారు.  

ఎలాంటి అనుమతి లేకుండా చర్చి స్థలాన్ని, భవనాన్ని  ఆరుగురు వ్యక్తులు లీజుకు ఇచ్చారని, వాటిని రద్దు చేయాలని ఇటీవల కలెక్టర్​కు ఫిర్యాదు చేశామన్నారు. ఆర్మూర్ లో సీఎస్ఐ చర్చి పరిధిలో 63 ఎకరాల స్థలం ఉండేదని, ప్రస్తుతం ఆరు ఎకరాలే మిగిలిందన్నారు. చర్చి భూములు, డబ్బుల విషయంపై ప్రశ్నిస్తే చర్చికి రావద్దని పాస్టర్ చెప్పడం తగదన్నారు.  సమావేశంలో సీఎస్ ఐటీఏ అధ్యక్షుడు వీసీ రవిచంద్రన్, ఆర్మూర్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యుడు ఆర్​.బాబీ ప్రసాద్, కన్వీనర్లు డేవిడ్ రాజ్, పాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.