ప్రభాస్ కల్కి లీక్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.. వైజయంతి మూవీస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD). దర్శకుడు నాగ్ అశ్విన్(Nag ashwin) తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే(Deepika padukone), అమితాబ్(Amitab), కమల్ హాసన్(Kamal haasan) వంటి స్టార్ నటిస్తున్నారు. పాన్ వరల్డ్ లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.

అయితే ఈ సినిమాకు తాజాగా లీకుల బెడద మొదలైంది. మేకర్స్ ఎంత జాగ్రత్త పడుతున్నా.. ఈ లీకుల పర్వం మాత్రం ఆగడంలేదు. తాజాగా ఈ సినిమా నుండి ప్రభాస్ కు సంబంధించిన మరో ఫోటో లీకైంది. అయితే ఈ ఫోటో లీక్ పై కల్కి మూవీ మేకర్స్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఈ ఫోటో లీకవడంలో ఏ సినిమాకు పనిచేస్తున్న VFX హస్తం ఉందని సమాచారం.

లేటెస్ట్గా కల్కి నిర్మాణ సంస్థ చట్టపరమైన కాపీరైట్ నోటీసును రిలీజ్ చేసింది. ఈ నోటిస్లో కల్కి2898AD మూవీకి పనిచేస్తున్న అన్ని భాగాలు కాపీరైట్ చట్టాల ద్వారా నడుస్తున్నాయి. మేకర్స్, మాత్రమే ఆఫీసియల్గా రిలీజ్ చేయుటకు హక్కులు ఉన్నాయి. అంతేకాని మా ప్రమేయం లేకుండా ప్రజలకు తెలియజేయాలని..లీక్ చేస్తే కనుక అందుకు చట్టపరమైన చర్యలు తప్పవు. కల్కి సినిమాలోని ఏదైనా భాగాన్ని.. వీడియోస్, ఫుటేజ్ లేదా ఫొటోస్ ద్వారా లీక్ చేస్తే కఠినమైన శిక్ష తప్పదు. అందుకు సైబర్ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..అంటూ వైజయంతి మూవీస్ నోటీసును రిలీజ్ చేసింది. 

ALSO READ : ఆ భయంతోనే విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇచ్చారు: ఆడమ్ గిల్‌క్రిస్ట్

రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఎంతోగానూ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ  గ్లింప్స్‌ లో మన పురాణాలకు సంబందించిన చాలా ఎలిమెంట్స్ ను చూపించారు దర్శకుడు నాగ్ అశ్విన్(Nag ashwin). శివ లింగం, కల్కి అవతారానికి సంబందించిన విగ్రహం. హిందూ దేవాలయాలు ఇలా చాలా ఎలిమెంట్స్ ను టచ్ చేశారు. చూస్తుంటే ఈ సినిమాను సైంటిఫిక్ గా చూపిస్తూనే మన పురాణాలకు కనెక్ట్ చేసేలా కనిపిస్తోంది. 

 

ఇక గ్లింప్స్‌లో సూపర్ హీరోగా ప్రభాస్ అదరగొట్టారు. విజువల్స్ కూడా నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సారి హాలీవుడ్ ను టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తోంది. మరో ఈ సినిమా రిలీజ్ తరువాత ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.