జీవీకేకు ఇన్వెస్టర్ల లీగల్‌ నోటీసులు

మియల్‌లో మీ వాటా అమ్మొద్దు
రూల్స్‌‌కు వ్యతిరేకమని స్పష్టీకరణ
అదానీ గ్రూపు ప్లాన్స్‌‌కు చెక్‌ ?

న్యూఢిల్లీ: జీవీకే గ్రూపు ముంబై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (మియల్‌)లోని తన వాటాను అదానీ గ్రూపునకు అమ్ముతున్నట్టు వార్తలు రావడంతో మిగతా ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. జీవీకే తన వాటాను అమ్మడం కాంట్రాక్టు రూల్స్‌కు వ్యతిరేకమని కన్సార్షియం కంపెనీలు అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ(ఏడీఐఏ), కెనడా పబ్లిక్‌ సెక్టార్‌ పెన్షన్‌(పీఎస్‌‌‌‌పీ) ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఇండియానేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌)లు జీవీకే గ్రూపు వైస్‌‌‌‌–చైర్మన్‌తోపాటు సంబంధిత బ్యాంకులకు ఈ నెల 27న నోటీసులు పంపాయి. మియల్‌లో జీవీకే వాటాలను దక్కించుకోవడానికి అదానీ గ్రూపు ప్రయత్నిస్తున్నదంటూ వస్తున్న వార్తలు తమకు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నాయి. ఇదే జరిగితే నవీ ముంబై ప్రాజెక్టు ఆగిపోతుందని, తమకు సమస్యలు వస్తాయని స్పష్టం చేశాయి. కన్సార్షియం నోటీసు అందుకున్న వారిలో జీవీకే
సంజయ్‌ రెడ్డితోపాటు ఎస్‌‌‌‌బీఐ చైర్మన్‌ రజ్‌నీశ్ కుమార్‌, హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌, ఐసీఐసీఐ, యాక్సిస్‌‌‌‌ బ్యాంకుల సీఈఓలు, గోల్డ్‌‌‌‌మన్‌ శాక్స్‌ ఇండియా సీఈఓ, పంజాబ్ నేషనల్‌ బ్యాంక్‌ ఎండీలు ఉన్నారు. మియల్‌ను ఇతర కంపెనీ టేకోవర్‌ చేయకుండా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని అబుదబీ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ (ఏడీఐఏ), కెనడా పబ్లిక్‌ సెక్టార్‌ పెన్షన్‌(పీఎస్‌‌‌‌పీ) ఇటీవల ప్రధానమంత్రి ఆఫీస్‌‌‌‌కు, ఫైనాన్స్‌మినిస్ట్రీకి లెటర్‌లు రాశాయి. ‘మియల్‌, నవీ ముంబై ఎయిర్‌పోర్లో ట్‌ కన్సార్షియం ఇన్వెస్ట్‌ చేస్తోంది. తొమ్మిది నెలల్లో వీరు 300 మిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు . థర్డ్‌‌‌‌ పార్టీ డీల్‌ కుదుర్చుకోకూడదని కాంట్రాక్ట్ లో స్పష్టంగా ఉండడంతో ఈ ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గకూడదని అనుకుంటున్నారు. అందుకే ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు ’ అని సంబంధిత వ్యక్తులు పేర్కొ న్నారు . ప్రైవేట్‌ ఇన్వెస్టర్లమధ్య నెలకొన్న లిటిగేషన్‌ను ఈ ఇన్వెస్టర్లు తమ దృష్టికి తీసుకొచ్చారని ఫైనాన్స్‌ మినిస్ట్రీ పేర్కొంది. ఇటువంటి విషయాల్లో తాము జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది.

కాంట్రాక్టులో ఏముందంటే…
కన్సార్షియం 2019 అక్టోబరులో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌లో 79 శాతంవాటాను జీవీకే గ్రూపు అమ్మాలనుకుంది. ఈ డబ్బుతో హోల్డింగ్‌‌‌‌ కంపెనీల అప్పులను తీర్చడంతోపాటు మియల్‌లో తమ వాటాను పెంచుకోవాలనుకుంది. అయితే లీగల్ సమస్యల వల్లజీవీకే ఈ విషయంలో ముందుకు వెళలేక్ల పోయింది. గత ఏడాది జనవరిలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం థర్డ్‌‌ పార్టీలకు వాటాలను అమ్మకూడదు. మియల్‌లో మరిన్ని పెట్టుబడుల కోసం ఇన్వెస్టర్లు ఎస్క్రో ఖాతాలో 300 మిలియన్ డాలర్లు డిపాజిట్‌ చేశారు. నవీముంబైలో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మించడానికి కూడా రెడీగా ఉన్నట్టు ప్రకటించారు . ఈ విషయమై జీవీకేతో చాలాసార్లు చర్చలు జరిపామని, ఎంతో ఖర్చు చేశామని వివరించారు. మియల్‌కు మొత్తం రూ.7,500 కోట్లు అప్పులు ఉండగా, వీటిలో స్టేట్‌బ్యాంక్ ఇచ్చిన లోన్‌మొత్తం రూ.నాలుగు వేల కోట్లు. జీవీకే గ్రూపు తన వాటాలను తనఖా పెట్టి బ్యాంకుల్లో లోన్లు తీసుకుంది. ఈ అప్పులు తీర్చకుంటే సదరుషేర్లను బ్యాంకులు అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. నవీ ముంబై ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కూడా లోన్ ఇవ్వడానికి స్టేట్‌ బ్యాంకు మొదట్లో ఒప్పుకుంది. అయితే జీవీకే గ్రూపు నిధుల దుర్వినియోగానికి పాల్పడిందంటూ సీబీఐ, ఈడీ కేసులు పెట్టడంతో తప్పుకుంది.

For More News..

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ పర్మినెంట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం?

ఓల్డెస్ట్ మ్యారిడ్ కపుల్ గా గిన్నిస్ రికార్డ్

ఆసియాలోనే ఫస్ట్ టైం.. చనిపోతూ కరోనా పేషెంట్‌కు ప్రాణం పోసిండు