కేసీఆర్ కు లీగల్ నోటీస్

కేసీఆర్ కు లీగల్ నోటీస్
  • అపోజిషన్ లీడర్ గా తొలగించాలె
  • అసెంబ్లీకి గైర్హాజరవుతున్నారన్నఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ 
  • ఆయనకు స్పీకర్ సమన్లు ఇవ్వాలని విజ్ఞప్తి

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత  కేసీఆర్‌ కు లీగల్  నోటీస్ ఇష్యూ అయ్యింది. అసెంబ్లీకి గైర్హాజరు నేపథ్యంలో కేసీఆర్‌‌కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ ఇవాళ ఈ నోటీసులు పంపింది.  అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని,  శాసన సభలో అపోజిషన్ లీడర్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని మాజీ సీఎం కేసీఆర్‌కు సభలో సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులో పేర్కొన్నారు.

ALSO READ | తెలంగాణలో కొత్తగా 1026 కి.మీ‘కవచ్‌’పనులు

ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్‌ పోరాటం చేయాలని, లేదంటే అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను వెంటనే అపోజిషన్ లీడర్‌గా తొలగించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌కు స్పీకర్‌ సమన్లు జారీ చేసి వివరణ కోరాలని పేర్కొంటూ అసోసియేషన్ తరపు న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారు.