Kalki 2898 AD : కల్కి టీంకు లీగల్ నోటీసులు.. అంత తప్పేం జరిగింది.. 

Kalki 2898 AD : కల్కి టీంకు లీగల్ నోటీసులు.. అంత తప్పేం జరిగింది.. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రూపొందిన కల్కి 2898AD వెయ్యి కోట్లు కొల్లగొట్టింది.బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ఈ సినిమా 25రోజులు కంప్లీట్ చేసుకుంది. 2024లో హయ్యెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచిన ఈ సినిమాకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. సనాతన ధర్మాన్ని వక్రీకరించారంటూ లీగల్ నోటీసులు జారీ అయ్యాయి.మాజీ కాంగ్రెస్ నేత ప్రమోద్ ఆచార్య హీరో ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, బిగ్ బీ అమితాబ్ సహా సినిమా యూనిట్ పై ఫిర్యాదు చేశారు.

కల్కి సినిమా మన మతగ్రంథాలకు విరుద్ధంగా చిత్రీకరించారని పేర్కొన్నారు ప్రమోద్. సినిమా హిందూ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అన్నారు.ఈ సినిమా విషయంలో తనకున్న అభ్యంతరాల పట్ల సినిమా యూనిట్ ను వివరణ కోరినట్లు తెలిపారు. హిందువుల మనోభావాలతో ఆడుకోవడం సినిమావాళ్లకు కాలక్షేపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రమోద్. ఈ మధ్య కాలంలో సాధువులను రాక్షసులుగా చూపించటం ఎక్కువయిందని, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే ఒకరి మనోభావాలతో ఆదుకోవడం కాదని స్పష్టం చేశారు.