
వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో శాంతమ్మ మలికిరెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ ‘ఇంతవరకు మన దగ్గర సరైన లీగల్ థ్రిల్లర్ సినిమాలు రాలేదు. నేను స్వతహాగా లీగల్ లాయర్‌ను కాబట్టి.. రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలనుకున్నా. డిసెంబర్ 27న సినిమా రిలీజ్ చేస్తున్నాం’ అని చెప్పాడు. ఈ గ్లింప్స్ అందరికీ నచ్చిందని చెప్పడం హ్యాపీ అని దర్శకుడు రవి అన్నాడు. నటుడు గిరిధర్, కొరియోగ్రాఫర్ వల్లం కళాధర్ పాల్గొన్నారు.