Legally Veer: న్యాయ వ్యవస్థ గురించి లీగల్లీ వీర్.. వెండితెరపై మరో రియల్ కోర్ట్ డ్రామా

Legally Veer: న్యాయ వ్యవస్థ గురించి లీగల్లీ వీర్.. వెండితెరపై మరో రియల్ కోర్ట్ డ్రామా

వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘లీగల్లీ వీర్’. రవి గోగుల దర్శకత్వంలో శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించారు. డిసెంబర్ 27న సినిమా రిలీజ్ కానుంది. సోమవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా  హీరో  వీర్ రెడ్డి మాట్లాడుతూ ‘రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో ఇందులో చూపించబోతున్నాం’ అని చెప్పాడు. ఇదొక అరుదైన సబ్జెక్ట్‌‌‌‌ అని,  ప్రతి సీన్ మన కళ్ల ముందే జరిగినట్టు ఉంటుందని దర్శకుడు రవి గోగుల అన్నాడు.  ప్రజాస్వామ్య దేశంలో న్యాయ వ్యవస్థ ఎంతో కీలకం అని, అలాంటి లా సబ్జెక్టుపై ఈ సినిమా రాబోతోందని నిర్మాత శాంతమ్మ అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.

ఇకపోతే ఇప్పటికే ఎన్నోచిత్రాలు తెలుగు తెరపై కోర్టు డ్రామా నేపథ్యంలో తెరకెక్కాయి. అందులో దాదాపు మెజారిటీ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి.. ఆలోచింపజేశాయి. ఇదే తరహాలో వస్తోన్న ‘లీగల్లీ వీర్’ పై అంచనాలు పెరిగిపోయాయి. మరి ఎలా థ్రిల్ ఇస్తుందో చూడాలి.