షాకింగ్.. భార్య, పెంపుడు కుక్కతో కలసి అనుమానాస్పద స్థితిలో స్టార్ హీరో మృతి..

షాకింగ్.. భార్య, పెంపుడు కుక్కతో కలసి అనుమానాస్పద స్థితిలో స్టార్ హీరో మృతి..

పలు హాలీవుడ్ సినిమాల్లో హీరో, విలన్ పాత్రల్లో నటించి మెప్పించిన ప్రముఖ హాలీవుడ్ నటుడు జీన్ హాక్‌మన్ (95) తన భార్యతో కలసి మృతి చెందిన ఘటన హాలీవుడ్ సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టించింది. అయితే జీన్ హాక్‌మన్ మరియు అతని భార్య బెట్సీ అరకావా (63) అమెరికాలోని న్యూ మెక్సికోలోని శాంటా ఫేలో నివాసం ఉంటున్నారు. వీరికి ఒక పెంపుడు కుక్క కూడా ఉంది. అయితే బుధవారం నుంచి హాక్‌మన్ ఇంట్లో నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

దీంతో శాంటా ఫే కౌంటీ షెరీఫ్ అడాన్ మెండోజా హాక్‌మన్ ఇంటికి చేరుకుని పరిశిలించగా అప్పటికే ఈ దంపతులతోపాటూ పెంపుడు కుక్క కూడా మరణించినట్లు కనుగొన్నారు. దీంతో ఒక్కసారిగా శాంటా ఫే ప్రాంతం ఉలిక్కిపడింది. ఉన్నట్లుండి హాక్‌మన్ దంపతులతోపాటూ పెంపుడు కుక్క మరణించడంతో ఈ కేసుని లోతుగా విచారించాలని అధికారులు పోలీసులకి ఆదేశాలు జారీ చేశారు. 

ALSO READ : మా పిల్లలు టెర్రరిస్టులు అవుతారంటూ అవమానించారు: నటి ప్రియమణి

ఈ విషయం ఇలా ఉండగా 1930లో జన్మించిన మిస్టర్ హాక్‌మన్ 100కి పైగా పాత్రలు పోషించారు. అంతేకాదు సినిమా రంగంలో ప్రతిభ కనబర్చిన వారికి ప్రధానం చేసే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డులను రెండు గెలుచుకున్నాడు. ఫ్రెంచ్ కనెక్షన్‌లో జిమ్మీ "పొపాయ్" డోయల్ పాత్రకు ఉత్తమ నటుడిగా, అన్‌ఫర్గివెన్‌లో లిటిల్ బిల్ డాగెట్ పాత్రకు ఉత్తమ సహాయ నటుడిగా ఈ వార్డులు అందుకున్నాడు. తమ అభిమాన నటుడు ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలాగే  జీన్ హాక్‌మన్ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.