Kannappa Movie: కన్నప్ప రేంజ్ పెంచేస్తున్న విష్ణు..రంగంలోకి లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా

మంచు విష్ణు(Manchu vishnu) టైటిల్ రోల్ లో కనిపించనున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కన్నప్ప(Kannappa). భారీ బడ్జెట్ తో, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్(Mukhesh kumar singh) దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే అధికారికంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. 

లేటెస్ట్ గా కన్నప్ప సినిమాలో ప్రభుదేవా జాయిన్ అయ్యారు. ఈ సినిమాలోని అద్భుతమైన సాంగ్స్ కు ప్రభుదేవా కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్‌లోడ్యాన్స్ మాస్టర్ ప్రభు దేవాకు కన్నప్ప టీం గ్రాండ్ వెల్ కం పలికింది. 

భారతదేశ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ గా పేరుపొందిన ప్రభుదేవా..కన్నప్ప లోకి ఎంట్రీ ఇవ్వడంతో మంచు విష్ణుకి బలమైన ఎమోషన్ వెపన్ దొరికినట్లు తెలుస్తోంది. ప్రభుదేవా రాకతో కన్నప్ప సినిమా మరో లెవెల్‌కు వెళ్లనుంది.' ప్రభు దేవా కొరియోగ్రఫీ ఎలక్ట్రిఫైయింగ్ సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుంది అని కన్నప్ప మూవీ టీం ప్రకటించింది'. 

ఈ భక్తి రస ప్రాజెక్ట్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. కన్నప్పలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో చాలా ముఖ్యమైన అతిథి పాత్రలో నటించాలని మోహన్ బాబు కోరగా..మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే..కన్నప్ప మూవీ మంచు ఫ్యామిలీకి తిరుగులేని విజయం అందుకోవడం కన్ఫమ్ అంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. 

ఇప్పటికే  ఈ ప్రాజెక్టు చాలా భారీగా తయారైంది. ఈ మూవీలో పలు కీలకమైన పాత్రల కోసం మంచు మోహన్ బాబు, శరత్ కుమార్, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ భాగమయ్యారు. ఈ సినిమాలో శివుడి పాత్ర కోసం..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను తీసుకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని మంచు విష్ణు ఇండైరెక్ట్గా రివీల్ చేశారు. 

ప్రస్తుతం ఈ సినిమా కోసం న్యూజిలాండ్‌, థాయ్‌లాండ్, ఇండియాకు చెందిన హైలీ టాలెంటెడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు.చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న మంచి విష్ణుకి ఇదే సరైన సమయం..సరైన సినిమా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ తెలుపుతున్నారు. పాన్ ఇండియా వైడ్‌ సినిమాగా రిలీజ్ కాబోతోన్న ఈ చిత్రాన్ని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల మీద మోహన్ బాబు నిర్మిస్తున్నారు.