చెన్నై: సీఎస్కే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వం బాగుందని లెజెండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసించాడు. బౌలర్లను మార్చిన తీరు ఆకట్టుకుందన్నాడు. ‘కెప్టెన్‌గా రుతురాజ్ అరంగేట్రం సూపర్. విజయంతో కెప్టెన్సీని ప్రారంభించడం కూడా చాలా బాగా అనిపించింది. బౌలింగ్‌లో మార్పులు ఆకట్టుకున్నాయి.
ఎందుకంటే ముస్తాఫిజుర్‌ను మార్చిన విధానం చూస్తే ఓ సీనియర్ కెప్టెన్ తీసుకున్న నిర్ణయం మాదిరిగా అనిపించింది. చివర్లో తుషార్ దేశ్‌పాండేపై నమ్మకం ఉంచి చహర్‌ను బాగా ఉపయోగించుకున్నాడు’ అని సన్నీ పేర్కొన్నాడు. టీమ్‌లో ధోనీ ఉండటం చాలా మార్పు తీసుకొచ్చిందన్నాడు. అవసరమైనప్పుడల్లా సలహాలు సూచనలు ఇస్తూ రుతురాజ్‌ను నడిపించిన విధానం కూడా బాగుందన్నాడు.
రాబోయే రోజుల్లో ఇదే విధంగా కంటిన్యూ చేస్తే రుతురాజ్ మంచి సారథిగా మారతాడని గావస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఆర్‌సీబీ షార్ట్ బాల్ స్ట్రాటజీ ఫెయిలైందని గుర్తు చేశాడు. మ్యాచ్‌లో ఎక్కువగా షార్ట్ బాల్స్ వేయడం వల్ల సీఎస్కే ఈజీగా రన్స్ రాబట్టిందన్నాడు.