లెజండరీ సంగీత దిగ్గజం, గజల్ గాయకుడు, పద్మశ్రీ విజేత పంకజ్ ఉదాస్ (73) ఈ రోజు (ఫిబ్రవరి 26న) తుది శ్వాస విడిచారు. చిట్టి అయి హై మరియు చండీ జై రంగ్ వంటి గజల్స్‌కు పంకజ్ ఉదాస్ ప్రసిద్ధి చెందారు.
ALSO READ :- Prabhas: లండన్లో ఇల్లు తీసుకున్న ప్రభాస్.. ఇకనుండి అక్కడేనట!
ఆయన మరణవార్తను అతని కుమార్తె నయాబ్ ఉదాస్ తెలియజేశారు.ఆయన మృతి పట్ల సినీ కళాకారులు, రాజకీయ నాయకులూ సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
1970 లో ఫస్ట్ టైం తుమ్ హసీన్ మై జవాన్ తో పంకజ్ ఉదాస్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. ఆయన సంగీత గానంతో ఎంతో మందిని అలరిస్తూ వస్తున్నారు. గుజరాత్ లోని జెట్పూర్ లో జన్మించిన ఉదాస్ చేసిన కళాత్మక సేవలకు గాను కేంద్రం 2006 లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.