భారత క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ స్పిన్నర్, భారత మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ (77) సోమవారం మరణించారు. 1967-1979 మధ్య ఈ దిగ్గజ స్పిన్నర్ ఇండియా తరపున 67 టెస్టులు ఆడి, 266 వికెట్లు, పది వన్డేల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు.
Also Read :- కొత్త ట్రాఫిక్ రూల్స్
సెప్టెంబరు 25, 1946న భారతదేశంలోని అమృత్‌సర్‌లో జన్మించిన బిషన్ సింగ్ బేడీ.. భారత బెస్ట్ స్పిన్నర్లలో ఒకడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బేడీ, ఎరపల్లి ప్రసన్న, BS చంద్రశేఖర్, S. వెంకటరాఘవన్‌లతో కలిసి భారత స్పిన్ బౌలింగ్ చరిత్రలో ఒక అధ్యాయాన్ని లిఖించారు. 1975 ప్రపంచ కప్ మ్యాచ్‌లో, అతని 12-8-6-1 అద్భుత బౌలింగ్ కారణంగా భారత్ కు తొలి విజయం దక్కింది. అనేకమంది స్పిన్ బౌలర్లకు మెంటార్‌గా పని చేసిన బేడీ.. దేశంలో యువ క్రికెట్ ప్రతిభను పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.