భారత దిగ్గజ హాకీ ప్లేయర్ చరణ్‌జిత్ సింగ్ కన్నుమూత

భారత దిగ్గజ హాకీ ప్లేయర్ చరణ్‌జిత్ సింగ్ కన్నుమూత

భారత దిగ్గజ హాకీ ప్లేయర్ చరణ్‌జిత్ సింగ్ (90) అనారోగ్యంతో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సింగ్.. గుండెపోటుతో హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాలోని తన ఇంట్లో గురువారం మరణించారు. ఇండియన్ హాకీ టీం 1964 టోక్యో ఒలింపిక్స్‎లో బంగారు పతకం సాధించింది. ఆ హాకీ జట్టుకు కెప్టెన్‎గా చరణ్‎జిత్ సింగ్ ఉన్నారు.  చరణ్‌జిత్‌కు ఐదేళ్ల క్రితం గుండెపోటు వచ్చింది. అప్పుడు ఆయనకు పక్షవాతం వచ్చింది. అప్పటి నుంచి చరణ్‌జిత్ కర్రసాయంతో నడిచేవాడు. కాగా.. గత రెండు నెలల నుంచి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. చరణ్ జిత్ 1964లో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాకుండా.. 1960 ఎడిషన్ గేమ్స్‌లో రజతం గెలిచిన జట్టులో, 1962 ఆసియా క్రీడల్లో రజతం గెలిచిన జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నాడు. 

చరణ్‌జిత్ సింగ్‎కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భార్య 12 సంవత్సరాల క్రితం మరణించింది. సింగ్ పెద్ద కుమారుడు కెనడాలో వైద్యుడిగా పనిచేస్తుండగా.. చిన్న కుమారుడు తండ్రితో పాటే ఉంటున్నాడు. చరణ్ జిత్ కుమార్తె వివాహం చేసుకొని న్యూఢిల్లీలో ఉంటుంది. ఆమె ఉనా చేరుకోగానే.. తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తామని సింగ్ కుమారుడు వీపీ సింగ్ తెలిపారు.

For More News..

సక్సెస్‎ఫుల్ వీర్యదాత.. 138 మందికి దానం