P Susheela: ప్రముఖ లెజండరీ సింగర్ పి.సుశీలకు తమిళనాడు ప్రభుత్వ పురస్కారం

P Susheela: ప్రముఖ లెజండరీ సింగర్ పి.సుశీలకు తమిళనాడు ప్రభుత్వ పురస్కారం

ప్రముఖ లెజండరీ సింగర్ గాన కోకిల పి.సుశీల (P Susheela)కు తమిళనాడు ప్రభుత్వం 2023 సంవత్సరానికిగానూ ‘కలైజ్ఞర్‌ నినైవు కలైతురై విత్తగర్‌’ (Kalaignar Memorial Award) పురస్కారాన్ని శుక్రవారం అక్టోబర్ 4న ప్రదానం చేసింది.

గానకోకిల పి. సుశీలకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు వరించడంతో పాటుగా రూ.10లక్షల బ్యాంకు చెక్, జ్ఞాపికను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందజేశారు. కాగా ఈ కార్యక్రమం చెన్నైలోని సచివాలయంలో ఘనంగా జరిగింది.  

2023 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు గాన కోకిల పి.సుశీల మరియు ప్రొఫెసర్, రచయిత, కవి మహ్మద్‌ మెహతాలను అక్కడి ‍ప్రభుత్వం ఎంపిక చేసింది.  దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతి సందర్భంగా ఏటా జూన్‌ 3న ‘కలైజ్ఞర్‌ నినైవు కలైతురై విత్తగర్‌’ (Kalaignar Memorial Kalaithurai Vithakar Viruthu) పురస్కారాన్ని అందించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. 

ఆంధ్రప్రదేశ్ లోని  విజయనగరానికి చెందిన పి. సుశీల 1950 నుంచి 1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమారంగతో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్.

ఐదు జాతీయ పురస్కారాలు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకున్న సుశీల.. ఆమె గాత్రమాధుర్యంతో 50 సంవత్సరాల పైబడి సాగిన సినీ జీవితంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగ, సింహళ భాషలలో 50 వేలకు పైగా గీతాలు పాడారు. దీంతో ఆమెను  గౌరవించే విధంగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.