సమాచార హక్కుచట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి : లేగ్గేల రాజు

ఎల్లారెడ్డి, వెలుగు: సమాచార హక్కుచట్టాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని రాష్ట్ర ఆర్టీఐ ప్రధాన కార్యదర్శి లేగ్గేల రాజు తెలిపారు. శనివారం ఎల్లారెడ్డిని జూనియర్​కాలేజీలో సమాచార హక్కు చట్టం – 2005 వారోత్సవాలు నిర్వహించారు.

రాజు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. సమాచారం అడిగిన 30 రోజుల్లో సంబంధిత అధికారులు స్పందించాలని, లేకుంటే వారి పై అధికారులకు అపీల్​చేయొచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఈసీ సభ్యులు లింగమయ్య, లెక్చరర్లు రాధ, సాయిలు, గణేశ్, రాములు పాల్గొన్నారు.