అవసరమైతే మూసీ ప్రక్షాళన కోసం పోరాటం: గుత్తా సుఖేందర్

అవసరమైతే మూసీ ప్రక్షాళన కోసం పోరాటం: గుత్తా సుఖేందర్

అవసరమైతే మూసీ ప్రక్షాళన కోసం పోరాటం చేస్తామన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.  రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ ను  స్వాగతిస్తున్నామని చెప్పారు. వాజ్ పేయ్ ప్రభుత్వం హయాంలోనే నదుల ప్రక్షాళనకు అడుగు పడిందన్నారు గుత్తా. కేసీఆర్ కూడా రివర్ ఫ్రంట్ పేరుతో ప్రణాళిక తీసుకువచ్చారని చెప్పారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్టు  బీఆర్ఎస్ నేతలు వ్యతిరేక ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు గుత్తా సుఖేందర్.

గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయని విమర్శించారు గుత్తా సుఖేందర్ రెడ్డి.   మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతంలోనే వెయ్యికి పైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారని తెలిపారు.    ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారని చెప్పారు గుత్తా