
ఇప్పటివరకూ కంప్యూటర్ లు, ల్యాప్‌టాప్‌ల ఉత్పత్తులకే ప్రసిద్ది చెందిన లెనొవో కంపెనీ.. స్మార్ట్ ఫోన్ ల ఉత్పత్తిలోనూ తమదైన ముద్ర వేయనుంది. ఈ చైనా మల్టీనేషన్ టెక్నాలజీ కంపెనీ.. లేటెస్ట్ గా ఇండియాలో మూడు కొత్త స్మార్ట్ హోమ్ ఉత్పత్తులను ప్రవేశపెట్టింది. లెనొవో స్మార్ట్ డిస్ప్లే 7, లెనొవో స్మార్ట్ బల్బ్ మరియు లెనొవో స్మార్ట్ కెమెరా లను మార్కెట్ లోకి విడుదల చేసింది. కాగా స్మార్ట్ డిస్ప్లే 7 ధర రూ. 8,999 గా ప్రకటించగా.. మిగతా రెండు ఉత్పత్తులకు సంబంధించిన ధరలను మరికొద్ది రోజుల్లో ప్రకటించనుంది.