లియో మూవీ వివాదం : గ్రూప్ డ్యాన్సర్లకు డబ్బులు ఎగ్గొట్టారంట..

లియో మూవీ వివాదం : గ్రూప్ డ్యాన్సర్లకు డబ్బులు ఎగ్గొట్టారంట..

దళపతి విజయ్(Thalapathy Vijay) హీరోగా నటించిన లియో(Leo) మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటిస్తోంది. లోకేష్‌ మార్క్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ మూవీ దసరా సందర్బంగా (అక్టోబర్ 19న) వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. లేటెస్ట్ అప్డేట్ మేరకు..లియో ఫస్ట్ సింగిల్ నా రెడీ పాటకు గాను గ్రూప్ డ్యాన్సర్లకు..మేకర్స్ డబ్బులు ఎగ్గొట్టరని సమాచారం.

ఇదే విషయంపై రియాజ్ అహ్మద్ అనే బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లలో ఒకరు..సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేయడంతో..ఇపుడు ఈ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో అతను..తనకు తగిన జీతం చెల్లించమని మేకర్స్‌ను అడిగినప్పటికీ రెస్పాండ్ లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో.. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(FEFSI) ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి ఓ ప్రకటన రిలీజ్ చేశారు.

రియాజ్ అహ్మద్ అనే బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేయడంతో..ఈ విషయం మా వద్దకు వచ్చినట్లు తెలిపారు. అతనొక్కడే కాదు, నా రెడీ సాంగ్ లో పనిచేసిన..అనేకమంది ఫ్రీలాన్సింగ్ డ్యాన్సర్లు తమ డబ్బు తమకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రొడక్షన్ హౌస్ సెవెన్ స్క్రీన్ స్టూడియో కార్యాలయానికి చేరుకున్నారు. నిన్న (అక్టోబర్ 10న) ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి(RKSelvamani) ఎట్టకేలకు తన మౌనాన్ని వీడి మొత్తం వివాదాన్ని వివరించారు.

ALSO READ: కల్కి నుంచి అమితాబ్‌ లుక్‌ రివీల్.. ఆసక్తిరేపుతున్న సాధువు గెటప్
 

నా రెడీ పాటలో మొత్తం 2000 మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్లు పాల్గొన్నారని, అందులో 600 మంది డ్యాన్సర్లు మాత్రమే తమిళనాడు ఫిల్మ్, టెలివిజన్ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ యూనియన్ (TANTTNNIS)లో రిజిస్టర్ చేసుకున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. మిగిలిన 1400 మంది ఫ్రీలాన్సింగ్ డ్యాన్సర్లను కొరియోగ్రాఫర్ దినేష్ మాస్టర్ నియమించారు.

అలాగే యూనియన్‌లో రిజిస్టర్ చేసుకున్న డ్యాన్సర్లకు రోజుకు రూ.1,750 చొప్పున మేకర్స్ నిర్ణయించారని, దాని ప్రకారం 600 మంది బ్యాంకు ఖాతాల్లో రూ.94,60,500 జమ చేశామని సెల్వమణి తెలిపారు. అంతే కాకుండా, యూనియన్‌లో నమోదు చేసుకోని డ్యాన్సర్ల ఖాతాలకు ఒక్కొక్కరికి రూ.10,500 (ఆరు రోజులకు) జమ చేయబడింది. అయితే, సంస్థలో రిజిస్టర్ అయిన వారి కోసం నిర్ణయించిన మొత్తాన్ని ఇప్పటికే డ్యాన్సర్ల యూనియన్‌కు పంపినట్లు మేకర్స్ తెలిపారంటూ సెల్వమణి వెల్లడించారు. 

సెవెన్ స్క్రీన్ స్టూడియో ఇంత భారీగా మూవీని తెరకెక్కించడానికి డబ్బులు ఉంటాయి గానీ..పని చేసిన వాళ్లకు డబ్బులు చెల్లించకపోవడం చాలా దారుణం అంటూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారుతుంది. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.