వచ్చింది వచ్చినట్లే ఖతం.. విశ్వావసు నామ సంవత్సరంలో సమానంగా సింహరాశి వారి ఆదాయం, వ్యయం

వచ్చింది వచ్చినట్లే ఖతం.. విశ్వావసు నామ సంవత్సరంలో సమానంగా సింహరాశి వారి ఆదాయం, వ్యయం
  • మఖ 1,2,3,4 పాదములు; పుబ్బ 1,2,3,4 పాదములు, ఉత్తర 1వ పాదము, మీ పేరులో మొదటి అక్షరం మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే
  • ఆదాయం : 11
  • రాజపూజ్యం : 3
  • వ్యయం : 11
  • అవమానం : 6

గురువు: 30.03.2025 నుండి 14.05.2025 వరకు సువర్ణమూర్తిగాను తదుపరి 18.10.2025 వరకు లోహమూర్తిగాను తదుపరి 05.12.2025 వరకు సువర్ణమూర్తిగా ఉగాది వరకు సంచారము. 

శని: ఉగాది నుంచి మరల ఉగాది వరకు అష్టమందు లోహమూర్తిగా సంచారము. రాహు సప్తమందు కేతువు జన్మ యందు ప్రతి విషయంలో సమస్యలలో సంచారము.

ఈ రాశి స్త్రీ పురుషులకు సామాన్యంగా ఉంటుంది. రైతు సోదరులకు ముహూర్తబలంతో అనుకూలమైన దిగుబడి రాగలదు. వృత్తి వ్యాపారస్తులకు ప్రతి విషయంలో అనుకూలత ఉంటుంది. లాయర్లు, డాక్టర్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. కాంట్రాక్టరు టెండరు రాలేదని బాధపడేదానికన్నా ఈ టెండర్​ ఒకటికి నాలుగుసార్లు చెక్​చేసి మంచి నక్షత్రంలో టెండర్​ వేయండి. రాజకీయ నాయకులకు చాలా సమస్యలు వచ్చును. ఎన్నో హామీలు ఇస్తారు. నెరవేర్చుట కష్టతరమవుతుంది. బిగ్​ ఇండస్ట్రీ వారికి సాధారణ లాభములు. 

►ALSO READ | ఆ పని చేశారో కర్కాటక రాశి వారు చిక్కుల్లో పడ్డట్లే.. విశ్వావసు నామ సంవత్సరంలో జాతకం ఎలా ఉందంటే..?

స్మాల్​ ఇండస్ట్రీ వారు చాలా జాగ్రత్తలు పాటించవలెను. వెండి, బంగారం వ్యాపారులు అర్థం కాని విధంగా ఉంటుంది. టింబర్​, ఐరన్​, సిమెంట్​, కంకర వారికి కొన్ని రోజులు బాగుంటుంది. మరల డబ్బు రొటేషన్​ జరగదు. వివాహ ప్రయత్నములు ఫలించును. నూతన వ్యాపారమునకు జాయింట్​ వ్యాపారము చేయువారికి కలయిక తగ్గి ఆర్గ్యుమెంట్స్​ వచ్చే అవకాశములు ఉన్నవి. ఫ్యాన్సీ కిరాణ వస్త్ర వ్యాపారులకు అంత అనుకూలత ఉండదు. పౌల్ట్రీ మత్స్య పరిశ్రమ పాడి పరిశ్రమ ఏదో జరిగిపోతుంది. 

చిట్స్​, షేర్స్​ సమస్యలుగా ఉండగలవు. ప్రైవేట్​ రంగంలో ఉన్నవారికి ఏమి అర్థం కాదు. పెట్టుబడికి తగిన ఆదాయం రాదు. డబ్బు కనిపించదు. రాహు కేతువుల ప్రభావము వలన ప్రతి విషయంలో చికాకులు ఉండగలరు. భార్యాభర్తల మధ్య సంతానము క్రమశిక్షణగా నడచుకొనలేరు. ఆదాయ వనరులు అంత అనుకూలంగా ఉండవు. రాత్రి పగలు కొన్ని రోజులు అటు ఇటుగా ఉంటాయి. సినిమా వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. టీవీ వారికి సామాన్యం. జనాకర్షణ ధనాకర్షణకు కొన్ని ప్రత్యేక పూజలు చేసుకొనగలరు.

ప్రతి విషయంలో పబ్లిసిటీ చేసుకోరాదు. గోప్యంగా ఉండండి. ప్రయత్నం చేయుటలో నిరాశ చెందరాదు. ఉద్యోగస్తులకు ట్రాన్స్​ఫర్​ ఉంటుంది. ప్రైవేట్​ ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకాగలవు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన రోజులు. ఏసీబీ దాడులలో వాస్తు తప్పులలో ఉన్నవారు స్త్రీలా పురుషులా అని కాదు ఆశలతో అడిగి డిమాండ్​ చేసి జైలుకు వెళతారు. వారు ఉన్న గృహం వాస్తు దోషం వలన జరుగును. మీ తెలివిగా మసలుకొనిన వారు ఏదో ఒకరకంగా ఎవరికి ఎక్కడ చిక్కరు. మీరు ఎవరికి దొరకరు. ఈ సంవత్సరం నాటకీయంగా ఉంటుంది. 

మఘ నక్షత్రం వారు జాతి వైఢూర్యం ధరించి చిత్రగుప్తుని దేవాలయంలో బుధవారం పూజలు చేయండి. వినాయక, సరస్వతి పూజలు చేయండి. పుబ్బ నక్షత్రంవారు జాతి డైమండ్​ ధరించండి. శక్తి లేనివారు అమెరికన్​ డైమండ్​ ధరించండి. శుక్రవారం లక్ష్మిదేవి పూజలు లక్ష్మీదేవి కవచం సహస్ర నామములు చేయండి. కనకధార స్తోత్ర పారాయణం చేయండి. 

►ALSO READ | మిథునరాశి రాశి వారికి ఈ ఏడాది పండగే పండగ.. ఊహించని రేంజ్‎లో ఆదాయం

ఉత్తర నక్షత్రం వారు జాతి కెంపు ధరించండి. ఆదివార నియమములు పాటించండి. ఆదిత్య హృదయ పారాయణం సూర్య దండకం చేయండి. నవగ్రహ ప్రదక్షిణలు, జప, దానములు చేయండి. ఈతి బాధలు తొలగును. ఈ సంవత్సరమంతా అఖండ దీపారాధన చేయుట వలన ఒత్తిడి తగ్గును. యోగ, ధ్యానము ఆక్యుప్రెషర్​ చేసుకొనిన వ్యాధులకు వెళ్లరు. పూర్తి ఆరోగ్యం ఉండగలరు. మానసిక ఒత్తిడి తగ్గును. మీరు మీ బలాన్ని ఒకసారి నెమరు వేసుకొని ముందుకు సాగండి. అదృష్టసంఖ్య1.