రవితేజ సినిమాకు అన్యాయం.. లియోకు అంత అవసరమా?

దసరా అంటేనే సినిమా లవర్స్ ఇష్టమైన సీజన్. ఈ సీజన్ ప్లాన్ చేసుకొని మేకర్స్ కూడా తమ తమ సినిమాల రిలీజ్ లు ప్లాన్ చేసుకుంటారు. వరుస సెలవులు ఉంటాయి కాబట్టి ప్రేక్షకులు సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కూడా దసరా సీజన్ కోసం భారీ సినిమాలను బరిలో దించుతాన్నారు మేకర్స్.

అందులో తెలుగు నుండి రవితేజ(Raviteja) టైగర్ నాగేశ్వర రావు(Tiger Nageswara rao), బాలకృష్ణ(Balakroshna) భగవంత్ కేసరి(Bhagavanth kesari), విజయ్ తలపతి(Vijay thalapathy) లియో(Leo) సినిమాలున్నాయి. అయితే ఇందులో టైగర్ నాగేశ్వర రావు, లియో రెండు పాన్ ఇండియా సినిమాలే. అయితే ఇక్కడే మన తెలుగు సినిమాకు అన్యాయం జరిగింది అనే వాదనలు వినిపిస్తున్నాయి. కారణం.. ఈ రెండు సినిమాల టికెట్స్ రేట్స్ ఇవే అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టైగర్ నాగేశ్వర రావు సినిమాకు మల్టీప్లెక్స్​ లో రూ.200, సింగిల్ స్క్రీన్​ రూ.150గా ఉండగా.. లియో సినిమాకు మల్టీప్లెక్స్​ లో రూ. 295, సింగిల్ స్క్రీన్​ రూ.175గా ఉంది. ఇప్పుడు ఇదే విషయాన్నీ తప్పుబడుతున్నారు తెలుగు ఆడియన్స్. 

తెలుగు సినిమాకు కాకుండా.. తమిళ సినిమాకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎందుకు. తెలుగులో ఒక డబ్బింగ్ సినిమాకు అంత టికెట్ రేట్స్ అవసరమా. ఈ రేట్స్ మన తెలుగు సినిమాకు ఇస్తే.. మనమే కదా బాగుపడేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. 

ALSO READ : 5 కిలోల బరువు తగ్గిన చంద్రబాబు, ప్రాణాలకు ప్రమాదం : భువనేశ్వరి