ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో మళ్లీ పులి సంచారం కలకలం రేపుతుంది. గత మూడు రోజుల క్రితం పెన్ గంగా సరిహద్దు చిన్న అర్లీ ప్రాంతంలో పులి సంచరించగా, తాజాగా పిప్పల్ కోటి సరిహద్దులో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆవు దూడ మృతి చెందింది.
పులి సంచారంపై స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందివ్వడంతో ఘటన స్థలానికి అధికారులు చేరుకొని పాదం వేలిముద్రలు సేకరించారు.
రైతులు, గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పులి సంచారంతో భీంపూర్ మండలంలోని తాంసీకే, గొల్లెఘాట్, పిప్పల్ కోటి, నిపాని గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతుండగా, రైతులు, రైతు కూలీలు పొలం పనులకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు.