హర్యానాలోని పానిపట్ సమీపంలో ఓ చిరుత పోలీసులపై దాడి చేసింది. బెహరంపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు ఫారెస్ట్ అధికారులకు గాయాలయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో గ్రామంలో సంచరిస్తున్న చిరుతను పట్టుకునేందుకు పోలీసులతో పాటు ఫారెస్ట్ అధికారులు వచ్చారు. అయితే చిరుత ఒక్కసారిగా వాళ్లపై అటాక్ చేసింది. కర్రలతో పోలీసులు చుట్టుమట్టినా.. అందరిపై దాడి చేసింది. చివరకు చిరుతకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి బంధించారు. గాయపడ్డ పోలీసులను ఆస్పత్రికి తరలించారు. ప్రాణాల నుంచి బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి