
మెదక్, చేగుంట, వెలుగు: చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గొల్లకుంట అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు పరిసర గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్లు అడవిలో కెమెరాలు ఏర్పాటు చేశారు. గొల్లకుంట ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్టు కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపూర్, బోనాల, కిష్టాపూర్, రుక్మాపూర్, రాంపూర్, కరీంనగర్, గొల్లపల్లి గ్రామాల ప్రజలు, రైతులు అటవీ ప్రాంతం వైపు వెళ్లొద్దని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ఆఫీసర్నాగరాణి సూచించారు.