నిర్మల్ జిల్లాలో పంట చేనులో చిరుత పిల్ల

నిర్మల్  జిల్లాలో పంట చేనులో చిరుత పిల్ల

భైంసా, వెలుగు: నిర్మల్  జిల్లా భైంసా మండలం సిరాల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పిల్ల సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సిరాల గ్రామానికి చెందిన రైతు మహేశ్​ గురువారం రాత్రి తన చేనులో మొక్క జొన్న పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు.

ఆ సమయంలో చేనులో చిరుత పులిని చూసిన మహేశ్​ భయంతో గ్రామానికి తిరిగి వచ్చి గ్రామస్తులు, ఫారెస్ట్​ ఆఫీసర్లకు సమాచారం అందించారు. డిప్యూటీ రేంజ్​ ఆఫీసర్​ శంకర్  సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి చిరుత పులి పాదముద్రలు గుర్తించారు.

రెండేండ్ల చిరుత పులి పిల్లగా గుర్తించామని తెలిపారు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చి ఉంటుందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.