రేపల్లెవాడలో మిర్చి తోటలో చిరుతపులి పిల్ల!

రేపల్లెవాడలో మిర్చి తోటలో చిరుతపులి పిల్ల!

తల్లాడ, వెలుగు : ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన వెనిగళ్ల శ్రీహరి అనే రైతు  మిర్చి తోటలో గురువారం చిరుతపులి పిల్ల కనిపించింది. తోటలో పనిచేసే వ్యక్తి గమనించి చిరుతపులి పిల్ల వెనుక నుంచి కొద్దిసేపు వీడియో తీసి ఫారెస్టు ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాడు. డీఆర్వో శ్రీనివాసరావు తన సిబ్బందితో ఆ ప్రదేశానికి వచ్చి చిరుతపులి పిల్ల పాదముద్రలు, ఆనవాళ్లను పరిశీలించారు. స్థానికులు అలర్ట్​గా ఉండాలని సూచించారు.