చేగుంట, వెలుగు: గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత చనిపోయిన ఘటన మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు శివారులో నేషనల్ హైవే –44 పై జరిగింది. కొన్నేండ్లుగా చేగుంట, నార్సింగి మండలాల పరిధిలో చిరుత పులి సంచరిస్తూ రైతులను, స్థానిక గ్రామాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం రాత్రి చిరుత అడవిలోంచి హైవే దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు.