జగిత్యాల జిల్లాలో కుక్కను తిన్న చిరుత..? భయాందోళనలో గ్రామస్తులు..

జగిత్యాల జిల్లాలో కుక్కను తిన్న చిరుత..? భయాందోళనలో గ్రామస్తులు..

జగిత్యాల జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది. మెట్పల్లి మండలం రంగారావుపేట గ్రామ శివార్లో చిరుత సంచరిస్తున్నట్లు తెలిసి  గ్రామస్తులు భయాందోళనలకు  గురవుతున్నారు. గ్రామ శివారులో తోటలో సగం తినిపడేసిన కుక్క మృతదేహం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అది చిరుత తిని వదిలేసిన కుక్క మృతదేహమేనని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. 

చిరుత సంచారం గురించి తెలిసి చుట్టు పక్కల గ్రామాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఎప్పుడ ఎవరిపై దాడి చేస్తుందోననే భయంతో ప్రజలు బిక్కు బిక్కు మంటున్నారు. చాలా మంది ఇళ్లలోనుంచి బయటకు రావటానికి భయపడుతున్నారు. అదేక్రమంలో ఫారెస్టు అధికారులు గ్రామస్తులు ఒంటరిగా శివారులోకి వెళ్ళొద్దని సూచించారు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే గుంపులుగా వెళ్లాలని సూచించారు. 

ALSO READ | తండ్రి కావాలనే కోరిక.. బ్రతికున్న కోడిపిల్లను మింగి వ్యక్తి మృతి.. కోడిపిల్ల సజీవం

గ్రామం దాటి వెళ్లకుండా ఒకరోజు రెండు రోజులు ఉండగలమని, కానీ ఇలా ఎన్నాళ్ల భయపడుతూ బయటికి వెళ్లకుండా ఉండాలని ఆందోళన చెందుతున్నారు గ్రామస్తులు. తమ పిల్లలకు, పశువులకు ఎప్పటికైనా ప్రమాదమేనని, అధికారులు వీలైనంత తొందరగా పట్టుకొని అడవులకు తరలించాని కోరుతున్నారు.