నిజామాబాద్‌‌‌‌ పోలీస్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌లోకి చిరుత

నిజామాబాద్‌‌‌‌ పోలీస్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌లోకి చిరుత

ఎడపల్లి, వెలుగు : నిజామాబాద్‌‌‌‌ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్‌‌‌‌, తానాకలాన్‌‌‌‌, గ్రామాల శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. రెండు రోజుల కింద ఓ బైకర్‌‌‌‌ వెంట పడిన చిరుత తాజాగా బుధవారం రాత్రి జానకంపేట్‌‌‌‌ శివారులోని పోలీస్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌లోకి వచ్చి అక్కడ ఉన్న ఓ కుక్కపిల్లను ఎత్తుకెళ్లింది. గమనించిన ఓ హోంగార్డు సిబ్బందిని అలర్ట్‌‌‌‌ చేసేలోపే చిరుత కుక్క పిల్లతో సహా అడవిలోకి వెళ్లిపోయింది. 

0పోలీస్‌‌‌‌ ట్రైనింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌ సీఐ శివరాం జిల్లా అటవీ శాఖ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వడంతో ఫారెస్ట్‌‌‌‌ రేంజ్‌‌‌‌ అధికారి సంజయ్‌‌‌‌గౌడ్‌‌‌‌తో పాటు పది మంది సిబ్బంది ట్రైనింగ్‌‌‌‌ సెంటర్‌‌‌‌కు వచ్చి చిరుత సంచరించిన పరిసరాలు, అటవీ ప్రాంతాలను పరిశీలించి చిరుత పాదముద్రలను గుర్తించారు. ఈ సందర్భంగా ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌వో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్న విషయం వాస్తవమేనని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తానాకలాన్‌‌‌‌ – జానకంపేట్, తానా కలాన్‌‌‌‌ –-బాపూనగర్, జానకంపేట్‌‌‌‌ – దూపల్లి గేట్‌‌‌‌ రోడ్లలో ఒంటరిగా ప్రయాణించొద్దని చెప్పారు. 

లేగదూడను చంపిన చిరుత

లింగంపేట : చిరుతపులి దాడి చేసి ఓ లేగదూడను హతమార్చింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామంలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన చౌడం స్వామి అనే రైతు బుధవారం సాయంత్రం గ్రామ శివారులోని  పొలం వద్ద ఆవులు, దూడను కట్టేసి ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం పొలం వద్దకు వెళ్లి చూడగా లేగ దూడ చనిపోయి కనిపించింది. దీంతో ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లకు సమాచారం ఇవ్వగా సెక్షన్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ వినోద్, బీట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ లింగయ్య ఘటనాస్థలానికి చేరుకొని లేగదూడను పరిశీలించారు.