జగిత్యాల జిల్లా రాయికల్ మండలం వస్తాపూర్లో చిరుత పులి కలకలం రేపింది. వస్తాపూర్ అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పొలంలో వరి నారు పోయడానికి వెళ్లగా.. కొంత దూరంలో చిరుతపురి సంచరిస్తూ కనిపించిందని.. స్థానికుడు ప్రవీణ్ చెబుతున్నాడు. పులిని చూసి ఒక్కసారిగా భయంతో గ్రామానికి పరుగులు పెట్టినట్లు తెలిపాడు.
చిరుత పులి ఎప్పుడు ఎటు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని చిరుతను బంధించి.. తమను కాపాడాలని కోరుతున్నారు.