
నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామంలో చిరుత పులి మృతి చెందింది.శనివారం గ్రామంలోని పులిగుట్ట దగ్గర తమకు 3 చిరుత పులులు కనిపించాయని, వాటిని చూడగానే చప్పుళ్లు చేశామని గ్రామస్తులు తెలిపారు. ఆ శబ్దంతో కు రెండు పులులు పారిపోగా.. ఒక పులి నడుచుకుంటూ కొద్ది దూరం వెళ్లి కిందపడిపోయిందని చెప్పారు. అనంతరం అక్కడే ప్రాణాలు కోల్పోయిందని గ్రా మస్తులు పేర్కొన్నారు. పులి మృతిపై వారు పోలీస్, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.