నిర్మల్ లో చిరుత సంచారం.. భయాందోళనలో స్థానికులు

నిర్మల్లో చిరుత సంచారం స్థానికులను భయాందోలనకు గురి చేస్తోంది. విశ్వనాథపేట నుంచి బంగల్ పేట వినాయకసాగర్ వైపు వెళ్లే మార్గంలో చిరుత సంచరించినట్లు పాదముద్రలు కనిపించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు.  ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారు. చిరుత పాద ముద్రలు గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.