కరీంనగర్ లో చిరుత సంచారం కలకలం

అడవిని వదిలి పల్లె బాట పడుతున్నాయి చిరుత పులులు. దీంతో శివారు పల్లె ప్రజలు.. ఎప్పుడు, ఏ సమయంలో చిరుత పులులు తమపై దాడి చేస్తాయోనని ప్రాణ భయంతో వణికిపోతున్నారు. ఇటీవల కాలంలో పులులు గ్రామాల్లోకి వచ్చి మనుషులు, జంతువులపై దాడి చేస్తున్న సంఘటనలు ఎక్కువయ్యాయి. తాజాగా కరీంనగర్ లోని సూర్యనగర్ రోడ్ నెంబర్-7 ఏరియాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. ఓ ఇంటి ముందు నడుచుకుంటూ వెళుతున్న దృష్యాలు సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 

చిరుత అర్ధరాత్రి వీధుల్లో సంచరించడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో భయటికి వెళ్లాలంటేనే భయంతో విణికిపోతున్నారు. ఫారెస్ట్ అధికారులు చిరుతను బంధించి అడవిలో వదిలేయాలని డిమాండ్ చేశారు సూర్యనగర్ కాలనీవాసులు.