చిరుత, పులి ఇలాంటి క్రూరమైన జంతువులు టీవీల్లో చూస్తేనే జనం భయపడతారు. అలాంటి మన ఇంటి ముందో... మన వీధిలోకో చిరుత వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఘటనే.. ముంబైలో చోటు చేసుకుంది. ఓ కాలనీలోకి వచ్చిన చిరుత ఏం చెక్కా చక్కర్లు కొట్టింది. నగరంలోని గోరేగావ్ ఈస్ట్ ప్రాంతంలో ఓ గేటడ్ కాలనీలోకి చిరుత ఎంట్రీ ఇచ్చింది. తిరుగుతూ... కాలనీలోని ఓ గేటు ముందు కూర్చొంది. ఆ తర్వాత అక్కడ్నుంచి ఓ చీకటిగా ఉన్నా ప్రాంతంలోకి వెళ్లిపోయింది. చిరుత సంచరించిన విజువల్స్.. సీసీ టీవీ ఫుటేజ్ లో గుర్తించారు అటవీ శాఖ అధికారులు. దీంతో ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. స్థానికంగా నివసించేవారికి అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు. గోరేగావ్ ప్రాంతంలో వీధి కుక్కల కోసం.. ఇలా తరుచూ అడవి జంతువులు వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో నిత్యం ఇక్కడి ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల్లో చిరుతపులి కదలికలు నమోదవుతున్నాయి.
అయితే ఈ ప్రాంతంలో చిరుత పులి కనిపించడం సర్వసాధారణంగా మారిన.. కొన్ని సార్లు మాత్రం ప్రమాదకరమైన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో ఈ ప్రాంతంలో ఓ వృద్ధురాలిపై చిరుతపులి దాడి చేసింది. దీంతో ఆ మహిళ వెంటనే తేరుకొని చిరుతపై పోరాడింది. కర్రతో భయపెట్టింది.. దీంతో చిరుత అడవిలోకి పారిపోయింది. కొద్ది రోజుల క్రింతి ఇదే ప్రాంతంలో 14 ఏళ్ల బాలుడిని చిరుతపులి గాయపరిచింది. బాలుడు రాత్రిపూట వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా జంతువు అతనిపై దాడి చేసింది. బాలుడి అరుపులు విని అతని స్నేహితులు సాయం చేసేందుకు పరిగెత్తగా చిరుతపులి పారిపోయింది. బాలుడి మెడ, నోరు, తలపై గాయాలయ్యాయి.
#leopard spotted in the CCTV footage of Gokuldham area in Goregaon East has been identified by the forest dept. The radio collar tht is clearly visible in this video was fitted in Nov last year. The occasional sightings of leopards is common in this neighborhood.@RoadsOfMumbai pic.twitter.com/BDb59DFU4q
— Virat A Singh (@tweetsvirat) January 17, 2022
ఇవి కూడా చదవండి:
పంజాబ్ సీఎం అభ్యర్థిని ఖరారు చేసిన AAP
గడ్డకట్టే మంచులో సైనికుల వాలీబాల్