దుబ్బగూడెం ఏరియా అడవిలోకి పెద్దపులి

దుబ్బగూడెం ఏరియా అడవిలోకి పెద్దపులి
  • పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ ఆఫీసర్లు  

బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఫారెస్ట్ డివిజన్‌‌‌‌‌‌‌‌ కన్నాల శివారులోని అడవిలో ఆరు రోజులు మకాం వేసిన పెద్దపులి ఎట్టకేలకు మంగళవారం అక్కడి నుంచి వెళ్లిపోయింది.  మంగళవారం ఉదయం కాసిపేట మండలం దుబ్బగూడెం పరిధిలో పత్తి చేనులోకి వెళ్తూ కనిపించింది. సమాచారం అందడంతో బెల్లంపల్లి అటవీ రేంజ్ ఆఫీసర్ పూర్ణచందర్, మంచిర్యాల డివిజన్ ఎఫ్‌‌‌‌డీవో సర్వేశ్వర్, ఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌ఓ రత్నాకర్‌‌‌‌ వెళ్లి పెద్దపులి పాదముద్రలను గుర్తించి దుబ్బగూడెం వైపు వెళ్లిందని నిర్ధారించారు.

కన్నాల పత్తి చేనులో పెద్దపులి ఒక అడవి పందిని దాడి చేసి చంపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెల్లంపల్లి పరిధి చిన్నబుగ్గ నుంచి కుంట రాముల బస్తీ అటవీ ప్రాంతం మీదుగా దుబ్బగూడెం వైపు వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.  .