![తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో చిరుత పులి](https://static.v6velugu.com/uploads/2023/09/Sri-Tirupati-Venkateswara-University_Y8EvSM27ft.jpg)
తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. (సెప్టెంబర్ 29) అర్ధరాత్రి 1గంట సమయంలో ఎంప్లాయిస్ క్వార్టర్స్ సమీపంలో చిరుత కదలికలు కనిపించాయని స్థానికులు తెలిపారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయని చెప్పారు.
దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. మరోవైపు వర్సిటీ క్యాంపస్‌లో చిరుత సంచారం గురించి తెలియడంతో విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు.