టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యాంపస్‌ల సమీపంలో.. చిరుతపులి కలకలం

టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యాంపస్‌ల సమీపంలో.. చిరుతపులి కలకలం

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యాంపస్‌ల సమీపంలో ఓ చిరుతపులి కనిపించిందని, దాన్ని పట్టుకోవడానికి అటవీ శాఖ ఆపరేషన్ ప్రారంభించిందని అధికారులు తెలిపారు. క్యాంపస్‌లు ఉన్న సూపర్ కారిడార్ ప్రాంతంలో ఉదయం 11, మధ్యాహ్నం 12 గంటల మధ్య చిరుతపులి కనిపించిందని, ప్రస్తుతం రెస్క్యూ టీమ్ ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో వెతుకుతోందని వారు వెల్లడించారు.

రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యే వరకు రెండు ఐటీ కంపెనీల ఉద్యోగులు తమ కార్యాలయాల నుంచి బయటకు రావద్దని హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయంపై స్పందించిన ఇండోర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌ఓ) ఎంఎస్ సోలంకి.. సూపర్ కారిడార్ ప్రాంతంలోని టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యాంపస్‌ల సమీపంలో చిరుతపులి కనిపించినట్లు తమకు సమాచారం అందిందని, ప్రస్తుతం ఆ చిరుతపులి కోసం రెస్క్యూ టీమ్‌ సెర్చింగ్  ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.