చిరుత పులి ఎప్పుడు చేప కాలేదు..చేప కూడా ఎప్పటికీ చిరుతపులిలా మారలేదు. కానీ ఇక్కడ ఓ చేప చిరుతపులిని తలపిస్తోంది. అచ్చం చిరుతపులి పోలిన మచ్చలున్న అరుదైన చేప ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
సముద్రపు లోతుల్లో అందంగా..వయ్యారంగా ఈతకొడుతున్న ఓ చేప కనిపించింది. ఈ చేప అచ్చం చిరుతపులిని పోలి ఉంది. చేప పై భాగాన చిరుతపులిని పోలిన మచ్చలున్నాయి. తెల్లని చిరుతపులి చేప ఆస్ట్రేలియాలో వెలుగు చూసింది.
ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్ లో కోరల్ సీ మెరైన పార్కులో ఇద్దరు స్కూబా డైవర్లు ఈతకొడుతున్నారు. ఈ సమయంలో వారికి అరుదైన చేప కనిపించింది. అది చిరుతపులని పోలి ఉంది. దీంతో వెంటనే దాన్ని వీడియో తీశారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
చిరుతపులిని పోలి ఉన్న ఈ చేప పేరు లెపార్డ్ పఫర్ ఫిష్ లేదా కాంతి గాస్టర్ లెపార్డ్ అంటారు. ఈ రకమైన చేపలు సాధారణంగా ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, గ్వామ్, మైక్రోనేషియా సముద్రాల్లోనే కనిపిస్తాయి. కానీ ఈ చేప ఆస్ట్రేలియాలో కనిపించడం ఇదే మొదటిసారి.
చిరుత టోబీ పఫర్ అంటే ..
రాక్ ఎన్ క్రిటర్స్ ప్రకారం..ఈ చేపను ఎక్కువగా అక్వేరియంలో సందర్శన కోసం పెడతారు. ఈ చేప ముందు భాగంలో రెండు చారలు ఉంటాయి. ముత్యం లాంటి తెల్లటి శరీరంపై చిరుతపులి పోలిన మచ్చలు ఉంటాయి. ఈ చేపను పట్టుకున్న సమయంలో ఈ మచ్చలు ఉబ్బుతాయి. ఈ చేప మూడు అంగులాల పొడువు ఉంటుంది. నీలి రంగు చారలు..చేప కళ్లను,తోకను హైలెట్ చేస్తాయి.